
హైదరాబాద్, వెలుగు: ‘‘పదేండ్ల పాటు గుర్తుకురాని యువత.. అధికారం కోల్పోగానే యాదికొచ్చారా?’’ అని కేటీఆర్‌ను ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నిలదీశారు. నిరుద్యోగ భృతిపై కేటీఆర్ చేసిన ట్వీట్‌కు సోషల్ మీడియా ‘ఎక్స్’లో ఆయన కౌంటర్ ఇచ్చారు.
‘‘తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నీ తండ్రి, నువ్వు రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారైనా యువతను కలిశావా? ఇంటికో ఉద్యోగం నినాదంతో అధికారంలోకి వచ్చి పదేండ్లలో ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు. కానీ, మీరు (కేసీఆర్ ఫ్యామిలీ) ఇంటి నిండా ఉద్యోగాలు ఇచ్చుకున్నారు” అని బల్మూరి వెంకట్ మండిపడ్డారు.