మూసీ ప్రక్షాళ నపై హరీశ్రావు విషం చిమ్ముతున్నరు : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

మూసీ ప్రక్షాళ నపై హరీశ్రావు విషం చిమ్ముతున్నరు : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
  •     మల్లన్న సాగర్ పాపాల భైరవుడు ఆయనే
  •     బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

హైదరాబాద్​, వెలుగు: మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్​రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. మూసీ నది బాగుపడితే హైదరాబాద్ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారన్న భయంతోనే బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​ఒక ప్రకటనలో హరీశ్​రావుకు కౌంటర్​ఇచ్చారు. గతంలో హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లుగా మారుస్తానని కేసీఆర్ బడాయి కబుర్లు చెప్పి మోసం చేశారని గుర్తుచేశారు. మూసీ సుందరీకరణ కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పిన కేటీఆర్ ఆ పేరుతో కోట్ల రూపాయలు దండుకుని సిటీ వాసులను దగా చేశారని విమర్శించారు. 

ప్రస్తుతం గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ నోటీసుల విషయంలో హరీశ్​రావు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఫైర్​ అయ్యారు. మల్లన్న సాగర్ కోసం14 గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించినప్పుడు హరీశ్​ రావుకు బాధితులు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. హరీశ్​ రావు చర్యల వల్ల నాడు మల్లన్న సాగర్ బాధితులు అనేక మంది చనిపోయారని  గుర్తుచేశారు. మల్లన్న సాగర్ పాపాల భైరవుడు ఆయనే అని ఫైర్ అయ్యారు.