
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరే స్థాయి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్‌కు లేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్అన్నారు. ఆయన సంస్కారం గురిం చి మాట్లాడుతుంటే నవ్వు వస్తుందన్నారు. గతంలో మీ తండ్రి కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు సమాజం మొత్తం చూసిందని, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు మాట్లాడితే ఎంత హేళన చేశారో ప్రజలు గమనించారని గుర్తుచేశారు. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా బరిలోకి దిగుతానని, సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి పోటీకి రావాలని కేటీఆర్‌కు గురువారం ఒక ప్రకటనలో వెంకట్ సవాల్ విసిరారు.