సీక్రెట్గా రాస్తే..కుట్రతో లీక్ చేసిండ్రు: ఎమ్మెల్సీ కవిత

సీక్రెట్గా రాస్తే..కుట్రతో లీక్ చేసిండ్రు: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లెటర్ పై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. పార్టీ నాయకుడికి  సీక్రెట్ గా రాసిన లెటర్ బయటకు రావడంపై కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఇదివరకు కూడా లెటర్ ద్వారానే తన అభిప్రాయాలను తెలిపాను. గత వారంరోజుల క్రితం ఈ లెటర్ రాశాను..  సీక్రెట్ గా రాస్తే.. కుట్రతో లీక్ చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని ఇటీవల తెలిపాను.. చెప్పిన కొద్ది రోజుల్లోనే ఈ లేఖ బహిర్గతం కావడం.. అంతర్గతంగా ఏంజరుగుతోందని అర్థమవుతోందన్నారు. 

తన తండ్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖపై ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇచ్చారు. ‘‘ఆ లేఖ రాసింది నేను ..అయితే నా తండ్రి, బీఆర్ ఎస్ నేత, మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బయటికి రావడం బాధకరం’’ అన్నారు. ‘‘రెండు వారాలక్రితం లేఖ రాశాను.. ఆ లేఖనాదే.. పర్సనల్ ఎజెండా ఏమీ లేదు..కార్యకర్తలు అభిప్రాయాలే చెప్పాను. నా వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పలేదు’’ అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

 కేసీఆర్ దేవుడు..అయితే ఆయన చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్లవల్లే నా లేఖ బయటికి వచ్చింది..అంతర్గతంగా నేను రాసిన లేఖ బయటికు రావడంలో కుట్ర ఉందన్నారు కవిత. నా లేఖే బయటికి వచ్చిందంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటని కవిత ప్రశ్నించారు. 

కేసీఆర్ మా నాయకుడు, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామన్నారు స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత. పార్టీలో లోపాలను సవరించుకుంటేనే భవిష్యత్  ఉంటుందన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వైఫల్యం చెందాయి.. ఆ రెండు పార్టీలకు కేసీఆరే ప్రత్యామ్నాయం అన్నారు.