ఫుట్‌పాత్లు ఆక్రమణలు తీసెయ్యండి : ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి 

ఫుట్‌పాత్లు ఆక్రమణలు తీసెయ్యండి : ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫుట్​పాత్​లు, నాలాలపై ఉన్న ఆక్రమణలను గుర్తించి వెంటనే తొలగించాలని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ పనితీరుపై మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్, బిల్డింగ్​నిర్మాణ అనుమతులు, ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ దరఖాస్తుల పెండింగ్ పై సర్కిల్ వారీగా రివ్యూ చేశారు. అప్లికేషన్ల విషయంలో ఆలస్యం జరగకుండా చూడాలన్నారు. ఇల్లీగల్ నిర్మాణాలు, అనుమతి లేని సెల్లార్ల ర్యాంపులు, మొక్కలు లేకుండా ఉన్న కుండీలను  గుర్తించి  తొలగించాలన్నారు.