200 సీట్లు వస్తాయని అంత కచ్చితంగా ఎలా చెప్పారు : బీజేపీ నేత యశ్వంత్ సిన్హా పోస్టు వైరల్

200 సీట్లు వస్తాయని అంత కచ్చితంగా ఎలా చెప్పారు : బీజేపీ నేత యశ్వంత్ సిన్హా పోస్టు వైరల్

బిహార్​ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయంపై బీజేపీ రెబల్ యశ్వంత్ సిన్హా చేసిన పోస్ట్​ వైరల్​ గా మారింది.. బిహార్ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనే అంశంపై కౌంటింగ్​ కు మూడు రోజుల ముందు యశ్వంత్​ సిన్హా ఆసక్తికర పోస్ట్ చేశారు. ఆ పోస్ట్​లో యశ్వంత్​ సిన్హా చెప్పింది అక్షరాలా నిజమైంది.. నిన్న జరిగిన బిహార్​ ఎన్నికల  ఓట్ల లెక్కింపు, ఫలితాల్లో బీజేపీ ఘన విజయం తర్వాత ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్​మీడియాలో వైరల్ అవుతోంది.. 

యశ్వంత్​ సిన్హా X  పోస్ట్​ లో ఏం రాశారు..? 

సాధారణంగా పాలక వర్గంపై యశ్వంత్ సిన్హా విమర్శలు పరిపాటి.. ఆయన విమర్శిలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. అయితే ఈసారి అనుకోకుండా సెఫాలజిస్టులు ,రాజకీయ విశ్లేషకులను కూడా మరిపించేలా పోస్ట్​ చేశారు. యశ్వంత్​ సిన్హా వ్యంగ్యంగా చేసిన పోస్ట్​ కూడా సంచలన​అంచనాలను చూపించింది.. నవంబర్ 11న తన X హ్యాండిల్ నుంచి ఆయన ఓ ట్వీట్ చేశారు..బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పు. నా సర్వే ప్రకారం NDA కనీసం 200 సీట్లు గెలుచుకుంటుంది.. మహాఘట్బంధన్ తుడిచిపెట్టుకుపోతుంది.. నవంబర్ 14న నా అంచనా ఘోరంగా తప్పు అయితే నేను బాధ్యత వహించను. అంటూ వెటకారంగా పోస్ట్ చేశారు యశ్వంత్​ సిన్హా. 

అయితే యశ్వంత్​సిన్హా వెటకారం కూడా అదేదో దైవవాణిగా మారింది.. 243 సీట్లో NDA కూటమి 200 కంటే ఎక్కువ సీట్లే గెలుచుకుంది. మహాఘట్భంధన్​ తుడిచిపెట్టుకుపోయింది.గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 80 సీట్లు తగ్గాయి.ఎగ్జిట్​ పోల్స్​ అన్నీ బిహార్​ లో ఎన్డీయే కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. కానీ ఇంత మెజార్టీని చూపించలేదు. ఎన్డీయే కూటమి 147, మహాఘట్బంధన్​ 90 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఎగ్జిట్​ పోల్స్​ వెలువడిన తర్వాత యశ్వంత్​ సిన్హా తన సెటైరికల్​ పోస్ట్​ను Xలో షేర్​ చేశారు. ఎన్నికల ఫలితాల రోజు అంటే శుక్రవారం మధ్యాహ్నం నాటికి మిలియన్​ వ్యూస్​ తో సిన్హా ట్వీట్ వైరల్ అయింది.