
సొంత రాష్ట్రం, సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. రేపు గుజరాత్ రాష్ట్రానికి నమో వెళ్లనున్నారు. గాంధీనగర్ లో తల్లి హీరాబెన్ ఆశీస్సులు తీసుకోనున్నారు.
ఆ తర్వాత 27న ఉత్తర్ ప్రదేశ్ లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం వారణాసి వెళ్లనున్నారు. అక్కడి ప్రజలు 4 లక్షల ఓట్ల మెజార్టీతో మోడీని గెలిపించారు. కాశీ విశ్వనాథుని దర్శనంతో పాటే వారణాసి ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు మోడీ. ఓ బహిరంగ సభలోనూ మోడీ మాట్లాడతారు.