టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని సన్‌రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసింది. షమీని ట్రేడింగ్ ద్వారా లక్నో సూపర్ జెయింట్స్ తీసుకుంది. ఐపీఎల్ 2025లో మహమ్మద్ షమీకి భారీ ధర దక్కింది. ఈ భారత పేసర్ ను రూ.10 కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్ దక్కించుకుంది. సన్ రైజర్స్ షమీ కోసం పట్టు పట్టి అతన్ని సొంతం చేసుకుంది. 2023లో ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడి ఆ సీజన్ లో టాప్ వికెట్ కీపర్ గా నిలిచిన షమీపై సన్ రైజర్స్ భారీగా ఆశలు పెట్టుకున్నప్పటికీ పూర్తిగా నిరాశపరిచాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 9 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. దీంతో షమీని హైదరాబాద్ జట్టు వద్దనుకుంది.
"సన్‌రైజర్స్ హైదరాబాద్ నుండి ట్రేడింగ్ లో మహమ్మద్ షమీ లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరాడు. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో రెండో ఖరీదైన ఆటగాడు షమీ. ఈ సీనియర్ ఫాస్ట్ బౌలర్ షమీని రూ 10 కోట్లకు లక్నో జట్టుకు రానున్నాడు. ఈ సీనియర్ పేసర్ కు అపారమైన అనుభవం ఉంది. 2013లో ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటి నుండి ఐదు ఫ్రాంచైజీలలో 119 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. SRHలో చేరడానికి ముందు షమీ గుజరాత్ టైటాన్స్ తరపున ఆడాడు. 2023 యుపీఏ సీజన్ లో 17 మ్యాచ్‌ల్లో 28 వికెట్లతో పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. గుజరాత్ టైటిల్ గెలుచుకున్నప్పుడు 20 వికెట్లు తీసి సత్తా చాటాడు". అని ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.
షమీ ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఐదు జట్లకు ఆడాడు. 2013లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన ఈ స్టార్ పేసర్.. మూడు మ్యాచ్ ల్లో మాత్రమే అవకాశం లభించింది. మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటే వికెట్ పడగొట్టి విఫలమయ్యాడు. 2014లో ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరి నాలుగు సీజన్లు (2014, 2016, 2017, 2018) ఆడాడు. ఢిల్లీ తరపున 32 మ్యాచ్ ల్లో షమీ 20 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2019 వేలంలో పంజాబ్ కింగ్స్ షమీని దక్కించుకుంది. 2019, 2020, 2021 సీజన్ లో పంజాబ్ జట్టు తరపున ఆడిన షమీ 58 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2022, 2023లో గుజరాత్ టైటాన్స్ జట్టు తరపున ఆడి 48 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
