వైరల్ వీడియో: టీమిండియా క్రికెటర్ల సరదా ఫైట్

వైరల్ వీడియో: టీమిండియా క్రికెటర్ల సరదా ఫైట్

చెన్నై: క్రికెటర్లు ఏం చేస్తున్నారనే దానిపై ఫ్యాన్స్ ఎప్పుడూ ఆసక్తిని చూపిస్తుంటారు. వాళ్ల ఫొటోలు, వీడియోలు ఏవి బయటికొచ్చినా వైరల్ అవుతుంటాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెట్‌‌లో హల్‌‌చల్ అవుతోంది. సదరు వీడియోలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మెడను యంగ్ పేసర్ మహ్మద్ సిరాజ్ పట్టుకోవడాన్ని చూడొచ్చు. దీనిపై సోషల్ మీడియాలో బజ్ ఏర్పడింది. ఇంగ్లండ్‌‌తో జరుగుతోన్న తొలి టెస్ట్ రెండో రోజు భారత టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌‌లో తీసిన ఈ షార్ట్ వీడియో క్లిప్‌‌లో కుల్దీప్ మెడను సిరాజ్ పట్టుకున్నాడు. ఇందులో కోచ్ రవిశాస్త్రి ఉండటాన్ని కూడా చూచొచ్చు. సిరాజ్ సరదాగా అలా ప్రవర్తించాడా లేదా సీరియస్‌‌గా చేశాడా అనేది ఇంకా తెలియరాలేదు.