ఎయిర్ షోలో ప్రమాదం.. గాల్లోనే ఢీకొన్న యుద్ధ విమానాలు.. ఎలా పేలిపోయాయో చూడండి

 ఎయిర్ షోలో ప్రమాదం..  గాల్లోనే ఢీకొన్న యుద్ధ విమానాలు.. ఎలా పేలిపోయాయో చూడండి

అమెరికాలో జరుగుతున్న ఎయిర్ షోలో ప్రమాదం జరిగింది. రెండు నేవీ జెట్ విమానాలు ఎదురెదురుగా గాళ్లో ఢీకొన్నాయి. వెస్ట్రన్ ఇదాహోలో ఉదయం మౌంటైన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో జరిగిన ఎయిర్ షోలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

యూఎస్ నేవీకి చెందిన EA18-G Growlers, ఎలక్ట్రానిక అటాక్ స్క్వాడ్రన్ 129 జెట్లు ఎదరెరుగా ధీకొన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ టీమ్ ప్రదర్శనలు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన జెట్ సిబ్బంది.. ప్యారాచుట్ ల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. క్రూ నెంబర్ల ఆరోగ్య పరిస్థితి కంట్రోల్ లోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికా గాయాలు కాలేదని చెప్పారు. 

ప్రమాదం జరిగిన వెంటనే బేస్ నుంచి అందరినీ బయటకు పంపించి ఎయిర్ బేస్ ను లాక్ చేసినట్లు ప్రకటించారు. ఎయిర్ షోలో మిగతా షోను రద్దు చేసినట్లు తెలిపారు.