V6 News

కర్నూలు లో మాంటెస్సోరీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కర్నూలు లో మాంటెస్సోరీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు
  •     చీఫ్ గెస్ట్‌‌గా పాల్గొన్న  ప్రముఖ డిజైనర్ వెంకట్ గడ్డం

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో మాంటెస్సోరీ విద్యాసంస్థలు నెలకొల్పి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా శనివారం కర్నూల్​లోని మాంటే ఇంటర్నేషనల్ స్కూల్లో ‘ఆర్ట్ ఎక్స్​ప్రెషన్’ పేరిట నిర్వహించిన ఆర్ట్  ఎగ్జిబిషన్​కు ముఖ్య​అతిథిగా ప్రముఖ డిజైనర్, ఆర్టిస్ట్ వెంకట్​గడ్డం హాజరయ్యారు. 

మాంటే స్కూల్ విద్యార్థులు గీసిన చిత్రాలతో ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆయన ప్రారంభించారు. ఎగ్జిబిషన్​ని చిత్రాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకటో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు పిల్లలు వేసిన ఆర్ట్ వర్క్స్ చాలా బాగున్నాయని చెప్పారు. స్టూడెంట్లు వాళ్లలోని భావాలను ఆకట్టుకునే చిత్రాల రూపంలో వ్యక్తం చేసిన తీరును ఆయన అభినందించారు. పిల్లలకు ఆర్ట్​వర్క్​పై శిక్షణ ఇచ్చి, వారిలో ఆసక్తి పెంచిన టీచర్లను ప్రశంసించారు.