- మహిళా ఉద్యోగుల ఫొటోలు తీసి మార్ఫింగ్
- ల్యాప్‌టాప్‌లో 1,300 వీడియోలు, 2,500 ఫొటోలు సీజ్?
- పోలీసుల అదుపులో నిందితుడు మహేశ్
హుస్నాబాద్, వెలుగు: గత కొన్ని సంవత్సరాలుగా మహిళల ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి వికృతానందాన్ని పొందిన ఉద్యోగి నిర్వాకం బయటపడింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ విద్యుత్ శాఖ డీఈ ఆఫీసులో మహేశ్ అనే ఆర్టిజన్ ఉద్యోగి గత తొమ్మిదేండ్లుగా కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అందరితో కలివిడిగా ఉంటూనే, ఆఫీసులోని మహిళా ఉద్యోగులు, ఇతర మహిళల ఫొటోలను రహస్యంగా సేకరించి.. ఆ ఫొటోలను తన పర్సనల్ ల్యాప్‌టాప్‌లో అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందేవాడు.
మహేశ్ ఆఫీస్‌లో ఉన్న సిస్టమ్‌లో వాట్సాప్ లాగిన్ అయి ఉన్న సమయంలో ఒక మహిళా ఉద్యోగి తన మార్పింగ్ ఫొటోలు చూసింది. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ల్యాప్ ట్యాప్‌ను క్షణ్నంగా పరిశీలించడంతో కంప్యూటర్ ఆపరేటర్ మహేశ్ నిర్వాకం బట్టబయలైంది.
ఈ విషయంపై బాధితులు డీఈ కృష్ణయ్యకు ఫిర్యాదు చేయడంతో ఆయన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి శుక్రవారం మహేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంబించారు. నిందితుడు మహేశ్ పర్సనల్ ల్యాప్‌టాప్‌ను పోలీసులు తనిఖీ చేయగా మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగుచూశాయి. అందులో ఏకంగా 1,300 మార్ఫింగ్ వీడియోలు, 2,500 మార్ఫింగ్ ఫొటోలు ఉన్నట్టు గుర్తించారు.
గత పది సంవత్సరాలుగా విద్యుత్ కార్యాలయంలోని ఉద్యోగులతో పాటు వివిధ పనులపై వచ్చే మహిళల ఫొటోలు తీసి.. వాటిని మార్పింగ్ చేసి ల్యాప్ టాప్ లో స్టోర్ చేసి పెట్టుకున్నాడు. మహేశ్ఆ వీడియోలు, ఫొటోలను ఎవరికైనా షేర్ చేశాడా? సోషల్ మీడియాలో పెట్టాడా? అన్న కోణంలో పోలీ సులు విచారణ ముమ్మరం చేశారు. ప్రస్తుతం మహేశ్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అతని ఆఫీస్ కంప్యూటర్‌తో పాటు ఇంట్లోని పర్సనల్ కంప్యూటర్ను కూడా పోలీసులు సీజ్ చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన మహేశ్‌పై కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
