తాండూరులో చేతబడి కలకలం... కూతురు ప్రేమ పెటాకులు కావాలని...తల్లి క్షుద్రపూజలు..! 

తాండూరులో చేతబడి కలకలం... కూతురు ప్రేమ పెటాకులు కావాలని...తల్లి క్షుద్రపూజలు..! 

ఒక పక్క ఏఐతో అద్భుతాలు సృష్టిస్తోంటే... కొంతమంది మూఢనమ్మకాల ఊబిలోనే ఉండిపోయారు. ఈ రోజుల్లో కూడా క్షుద్రపూజలు, చేతబడులను ఆశ్రయించేవారు ఉన్నారంటే నమ్ముతారా...? వికారాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన చుస్తే నమ్ముతారు. వికారాబాద్ జిల్లా తాండూరులో చేతబడి కలకలం రేగింది. కూతురు ప్రేమ పెటాకులు కావాలని.. కూతురిపైనే చేతబడి చేయించింది ఓ తల్లి.ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

తాండూరు మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన ఇందిరా ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. అయితే కూతురు ప్రేమ పెటాకులు కావాలని తల్లి సాయమ్మ తాండూరు పట్టణానికి చెందిన  మంత్రగాడిని సంప్రదించింది. కాలనీ వాసుల జోక్యంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ క్రమంలో శుక్రవారం ( మే 1 ) ఉదయం తెల్లవారుజామున పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలో  నిర్మానుష్య ప్రదేశంలో అమ్మాయిని కూర్చోబెట్టి క్షుద్ర పూజలు చేస్తుండగా చూసిన కాలనీవాసులు ఇక్కడ ఏం చేస్తున్నావని ప్రశ్నించారు. విషయాన్ని అర్థం చేసుకొని కాలనీవాసులు కొందరు మంత్రగాడికి దేహాశుద్ధి చేశారు.

ఈ విషయం కాలనీ వాసుల జోక్యంతో తాండూరు పట్టణ పోలీసుస్టేషన్ కు చేరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.