ఎమ్మెల్యే అయ్యి ఉండి.. ఏంటీ వెధవ పనులు

ఎమ్మెల్యే అయ్యి ఉండి.. ఏంటీ వెధవ పనులు

బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ గౌరీ శంకర్ బిసెన్ ఓ కార్యక్రమంలో మైనర్ బాలికలను అనుచితంగా తాకినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన కెమెరాలో రికార్డ్ కాగా, ఎంపీ కాంగ్రెస్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఆ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఎమ్మెల్యే మైనర్ బాలికలతో కలిసి ఫొటో కోసం వారి ఛాతీ, చేతులను తాకడం చూడవచ్చు. “బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ గౌరీ శంకర్ బిసెన్ అమ్మాయిలతో సిగ్గుమాలిన పని చేస్తున్నారు. బీజేపీ నాయకుల నుండి కుమార్తెను రక్షించండి" అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

ఈ పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తూ, “ఈ అమ్మాయిలకు మహిళా డాక్టర్ కౌన్సెలింగ్ ఇవ్వాలి, వారి నివేదికను బహిరంగపరచాలి. అమ్మాయిలతో ఇలాంటి పని చేయడం సిగ్గుచేటు. బీజేపీ నేతలకు సిగ్గుచేటు. శివరాజ్ సింగ్ చౌహాన్.. మీకు సిగ్గు ఉందా.. మీ పార్టీ నేతలు ఏం చేస్తున్నారో చూడండి?" అంటూ ముంబై కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముఖేష్ గుప్తా మండిపడ్డారు.

https://twitter.com/INCMP/status/1671931256509173761