రేవంత్ రెండేళ్ల పాలనపై బీజేపీ చార్జ్ షీట్

రేవంత్ రెండేళ్ల పాలనపై బీజేపీ చార్జ్ షీట్

ఢిల్లీ: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమీషన్లమయంగా మారిపోయిందని నిజామాబాచ్ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. టోకెన్ కు  ఇంత అని కమీషన్ పెట్టి ఓపెన్గా వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ వేదికగా.. కాంగ్రెస్ రెండేండ్ల పాలనపై చార్జ్ షీట్ విడుదల చేశారు. 

ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ..'ముఖ్యమంత్రి రేవంత్ కు  ప్రజలకు మంచి చేయాలనే కనీస ఉద్దేశం లేదు. లాటరీ తగిలింది.. దోచుకుందాం అనే తరహాలో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. గత రెండేళ్లలో 790 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు. రెండు లక్షల రుణమాఫీ సరిగా చేయలేదు. ఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా అంటున్నారు. ఫుట్బాల్ ఆడడానికి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడా?. కేంద్రం నుంచి నిధులు వస్తున్న వాటిని సరిగా వినియోగించడం లేదు. తెలంగాణ బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. మేము అంతా ఒక్కటే.. మా మధ్య సఖ్యత ఉంది. బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు నాకు పెద్దన్నలాంటి వారు. ఆయన నాయకత్వంలో పని చేస్తం' అని తెలిపారు.