ఓటు చోరీ, పేపర్ లీకేజీలకు తండ్రిలాంటి వారు ప్రధాని మోడీ: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఓటు చోరీ, పేపర్ లీకేజీలకు తండ్రిలాంటి వారు ప్రధాని మోడీ: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • పాదర్స్ డే సందర్భంగా ప్రధాని మోదీకి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సెటైరికల్ విషెస్

న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో నాటకీయ రాజకీయాలు, ఓటు చోరీ, పేపర్ లీకేజీ స్కాంలు, పెద్దనోట్ల రద్దు వంటి వాటికి ప్రధాని మోదీ తండ్రి లాంటి వారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎద్దేవా చేశారు. ఆదివారం ‘ఫాదర్స్ డే’ను పురస్కరించుకొని ప్రధాని మోదీపై వ్యంగ్యంగా విమర్శలు చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. 

‘రాజకీయాలు, మెలోడీ దౌత్యం, పెద్ద నోట్ల రద్దు, రూపాయి విలువ తగ్గింపు, నిరుద్యోగం, నీట్ పేపర్ లీక్ స్కాంలు, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల వాగ్దానం, ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానన్న హామీ, ఓటు చోరీ, 100 స్మార్ట్ సిటీల వాగ్దానాలు, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీలకు మోదీ తండ్రి లాంటి వారు. 

మరి ముఖ్యంగా పాదర్ ఆఫ్ అచ్చేదిన్ (మంచి రోజులకు తండ్రి లాంటి వారు). కానీ... ఆయన పాలనలో ప్రస్తుతం భారత్ పరిస్థితి మరోలా ఉంది. అందుకే ఆయనిచ్చిన వాగ్దానాలు, దేశంలోని పరిస్థితుల తరఫున మోదీకి ఫాదర్స్ డే శుభాకాంక్షలు’’అంటూ ఎంపీ వంశీకృష్ణ ప్రధాని మోదీకి సెటైరికల్‌‌‌‌గా విషెస్ తెలిపారు.