నన్ను రెచ్చగొట్టొద్దు..రేవంత్కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరిక

నన్ను రెచ్చగొట్టొద్దు..రేవంత్కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరిక

కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ నేమ్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిఆగ్రహం వ్యక్తం చేశారు.  రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే ఆయన పేరు పెట్టి మాట్లాడాలి కానీ.. మీరు అని మాట్లాడటం సరికాదన్నారు. రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందేనని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ లో చేరాడని.. రాజగోపాల్ రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసి వెళ్తున్నారని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు రేవంత్ పుట్టలేదన్నారు. తనను రెచ్చగొట్టొద్దంటూ రేవంత్ ను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సున్నితంగా హెచ్చరించారు .


కాంగ్రెస్ కోసం తాను 34  ఏళ్ల నుంచి కష్టపడుతున్నానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పార్టీ కోసం రక్తం దారపోశానని చెప్పారు.  కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ నిజాయితీతో ఉన్న వాళ్లమే అని తెలిపారు. తన మీద మాట పడితే పడనని వెంకట్ రెడ్డి అన్నారు.  తాము చదువుకున్న తరువాత సొంతంగా కాంట్రాక్టులు చేసుకుని పైకొచ్చామని.. ఎవరినీ మోసం చేయలేదని స్పష్టం చేశారు. రేవంత్ కామెంట్స్ తనను బాధించాయన్న ఆయన..రేవంత్ కామెంట్స్ పై ప్రజలు బాధ పడతారని చెప్పారు.