సీఎం కేసీఆర్ కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ

సీఎం కేసీఆర్ కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ

ఎస్.ఎల్.బి.సి, ఉదయ సముద్రం ప్రాజెక్టుల పనితీరుపై సీఎం కేసీఆర్ కు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. నల్గొండ ప్రగతి కోసం ఆనాటి సీఎం వైఎస్ ను ఒప్పించి ఎస్.ఎల్.బి.సి  ప్రాజెక్ట్ ను 2004 లో స్టార్ట్ చేశామని గుర్తు చేశారు. 13-08-2004 న పనులను జై ప్రకాష్ అనే సంస్థకు అప్పగించడం జరిగిందని..  సొరంగ మార్గం 44 కిలోమీటర్లు ఉంటే జై ప్రకాష్ అనే సంస్థ ఇప్పటి వరకు 15 ఏళ్లు పూర్తయినా 34 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేయగలిగిందన్నారు.  గుజరాత్ లోని సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ని వారు నిర్మించారు… ఆ సంస్థకు మంచి పేరు ఉంది కాని..  ఇప్పుడు ఆ ఏజెన్సీ కష్టాల్లో ఉంది.. జై ప్రకాష్ సంస్థ సంక్షేభంలో కూరుకుపోయింది.. ప్రభుత్వం ఆ సంస్థ కు ఎన్ని సార్లు అడ్వాన్స్ లు ఇచ్చినా పనులు చేయలేకపోతోంది.. 44 కిలోమీటర్ల టన్నెల్ లో ఇంకా 10 కిమిటర్ల పని పెండింగ్ లో ఉంది.. ఏజెన్సీ వైఫల్యం కారణంగా జిల్లా ప్రజలు శ్రీశైలం రిజర్వాయర్ నుండి పూర్తి స్థాయిలో నీటిని ఉపయోగించుకోలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్.ఎల్.బి.సి పూర్తి కాక నల్గొండ ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. పెండింగ్ పనులను ఇప్పుడు ఉన్న సంస్థ కు కాకుండా వేరే గుర్తింపు పొందిన సంస్థకు ఇవ్వాలని కోమటిరెడ్డి కోరారు. దీని వల్ల ఎస్.ఎల్.బి.సి పెండింగ్ పనులు పూర్తి అయ్యి నల్గొండ జిల్లా ప్రజల సాగునీరు,తాగు నీరు సమస్య పరిష్కారామవుతుందని.. నల్లగొండ జిల్లా ససశ్యామలం అవుతుందని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

అదేవిధంగా ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తి చెయ్యాలని ఆయన కోరారు. కరువు , ప్లోరైడ్ పీడిత ప్రాంతంగా ఉన్న నల్లగొండ జిల్లా ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ని ఒప్పించి  ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభిం చామని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్ట్ తో నల్లగొండ, మునుగోడు , నకిరేకల్ నియోజకవర్గాల నీరు అందుతుంది.. బ్రహ్మణ వెల్లంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తి అయింది… అయితే 6 కిలోమీటర్ల కాల్వల పనులు ఇంకా పూర్తి కాలేదు.. కాల్వల పనులు పూర్తి కాకపోవడంతో నీళ్లు వదలడం లేదు..  ఆర్థిక ఇబ్బంది కారణంగా 6 నెలల నుండి పనులు జరగటం లేదని తెలిపారు. ఇప్పటికి 4 కిలోమీటర్ల కాల్వల పనులు మాత్రమే పూర్తి అయ్యాయి.. సీఎం కేసీఆర్ వెంటనే జోక్యం చేసుకుని.. ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తి చేయాలని.. ఈ ప్రాజెక్ట్ లో జాయింట్ వెంచర్ గా ఉన్న మెగా సంస్థకు పనులు అప్పగిస్తే పనులు వేగమంతం అవుతాయని ..  కాబట్టి వెంటనే  ఈ  ప్రాజెక్ట్ పనులను కూడా  పూర్తి చేసి నల్లగొండ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాలకు నీటిని అందించాలని కోమటిరెడ్డి లేఖలో కోరారు.