V6 News

తెలంగాణపై తేజస్వి సూర్య వ్యాఖ్యలు రికార్డ్స్ నుంచి తొలగించండి: స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ వంశీకృష్ణ లేఖ..

తెలంగాణపై తేజస్వి సూర్య వ్యాఖ్యలు రికార్డ్స్ నుంచి తొలగించండి: స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ వంశీకృష్ణ లేఖ..

తెలంగాణపై ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయ వర్గాలు సహా ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు తేజస్వి సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు పలువురు నేతలు. ఈ క్రమంలో తేజస్వి వ్యాఖ్యలు రికార్డ్స్ నుంచి తొలగించాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు ఎంపీ వంశీకృష్ణ. తేజస్వి వ్యాఖ్యలు తెలంగాణ ఏర్పాటు కోసం చేసిన త్యాగాలు, ప్రజాస్వామ్య పోరాటం చేసిన ప్రజల మనోభావాలు తీవ్రంగా గాయపరిచాయని అన్నారు.

తేజస్వి అనుచిత వ్యాఖ్యలు పార్లమెంట్ గౌరవ మర్యాదలకు విరుద్ధమని అన్నారు ఎంపీ వంశీకృష్ణ.ఈ క్రమంలో లోక్‌సభ నియమావళి, ముఖ్యంగా రూల్ 380 ప్రకారం మీకున్న అధికారాలను ఉపయోగించి, సభ అధికారిక రికార్డుల నుండి తేజస్వి అనుచిత వ్యాఖ్యలు తొలగించాలని కోరారు.

అంతేకాకుండా, పార్లమెంటరీ ప్రవర్తనా ప్రమాణాలను నిలబెట్టడానికి.. ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని కాపాడటానికి, తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని స్పీకర్ ను కోరారు ఎంపీ వంశీకృష్ణ.

ఈ క్రమంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కూడా సభను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని... అలాంటి వ్యాఖ్యలు హక్కుల ఉల్లంఘన కిందికి వస్తాయో లేదో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.