
మృణాల్ ఠాకూర్ ‘లస్ట్ స్టోరీస్ 2’లో నటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ విడుదలై హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో కాబోయే భర్తలో లస్ట్‌ను పెళ్లికి ముందే పరీక్షించే యువతి పాత్రలో ఆమె నటించింది. తాజాగా తన రోల్‌పై మృణాల్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. కుటుంబసభ్యులు ఇంట్లో టీనేజర్ల ముందు సెక్స్ గురించి మాట్లాడేందుకు సంకోచిస్తారిని తెలిపింది.
కానీ, సెక్స్, లస్ట్ వంటి విషయాలను ఆరోగ్యకరమైన రీతిలో చెప్పడం ద్వారా వారిలో అవగాహన కల్పించవచ్చన్నారు. ఇటువంటి సంభాషణలు పిల్లలకు మేలు చేస్తాయని పేర్కొంది. ఈ విషయాలను ఓపెన్‌గా మాట్లాడితే వారు తప్పుదారి పట్టరని తెలిపింది. ఈ సిరీస్‌లో అంగద్ బేడీ సరసన మృణాల్ నటించింది. సమాజంలోని ఆధునిక పోకడలను ఎలివేట్ చేస్తూ దీనిని తెరకెక్కించారు.