V6 News

దటీజ్ మిస్టర్ కూల్ : ధోనీ రికార్డుల మోత

దటీజ్ మిస్టర్ కూల్ : ధోనీ రికార్డుల మోత

మిస్టర్ కూల్ ధోనీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నడు.  ఈ సారి ఐపీఎల్ లో మంచి జోరుమీదున్న ధోనీ ..రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌ లో  చెలరేగి ఆడాడు. ఈ మ్యాచ్ లో పలు ఘనతలు సాధించాడు ధోనీ. IPL చరిత్రలో 4 వేల రన్స్ పూర్తి చేసిన ఫస్ట్ కెప్టెన్‌ నిలిచాడు. ఇప్పటివరకు 184 IPL మ్యాచ్‌ లు ఆడిన ధోని 42.03 సగటుతో 4వేల 330 రన్స్ చేశాడు. ఇందులో 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

IPLలో 200 సిక్సర్లు పూర్తి చేసిన ఫస్ట్ భారత బాట్స్‌ మన్‌ గా కూడా ‘మిస్టర్‌ కూల్‌’ రికార్డు కెక్కాడు. 203 సిక్సర్లలో మూడో స్థానానికి చేరాడు. క్రిస్‌ గేల్‌(323), ఏబీ డివిలియర్స్‌(204) అతడి కంటే ముందున్నారు. రోహిత్‌ శర్మ(190), సురేశ్‌ రైనా(190), విరాట్‌ కోహ్లి(186) కూడా ధోనికి దగ్గరలో ఉన్నారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(84)ను ధోని మెరుగుపరుచుకున్నాడు. ఐపీఎల్‌ లో ధోనికి ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఈ మ్యాచ్ చివరివరకు ఉత్కంఠబరితంగా సాగింది. ఒక్క రన్ తేడాతో గెలిచింది RCB. అయితే లాస్ట్ ఓవర్ లో 26 రన్స్ అవసరంకాగా 24 రన్స్ కొట్టి, ఔరా అనిపించాడు మిస్టర్ కూల్ ధోనీ. మ్యాచ్ ఓడినా..ధోనీపై ప్రశంసలు మాత్రం వెల్లువెత్తుతున్నాయంటే..దటీజ్ మిస్టర్ కూల్ ధోనీ అంటున్నారు ఫ్యాన్స్.