V6 News

Jetlee Trailer Release: నవ్వుల విమానం ‘జెట్లీ’ రెడీ.. ట్రైలర్‌తోనే హీట్ పెంచిన సత్య!

Jetlee Trailer Release: నవ్వుల విమానం ‘జెట్లీ’ రెడీ..  ట్రైలర్‌తోనే హీట్ పెంచిన సత్య!

' మత్తు వదలరా' సిరీస్ తో తనదైన కామెడీ టైమింగ్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన కమెడియన్ సత్య. ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా ‘జెట్లీ’ (Jetlee) చిత్రంతో అలరించడానికి సిద్ధమయ్యారు. విలక్షణ దర్శకుడు రితేష్ రాణా తెరకెక్కించిన ఈ క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్ మే 1, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.  లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కామెడీ పీక్స్‌!

లేటెస్ట్  ట్రైలర్ చూస్తుంటే రితేష్ రాణా తన మార్క్ స్టైలిష్ కామెడీతో పాటు కథను కూడా ఇంట్రెస్టింగ్ రివీల్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విమానం (Flight) నేపథ్యంలో సాగే సన్నివేశాలు, సత్య మార్క్ మేనరిజమ్స్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడం ఖాయంగా కనిపిస్తోంది. సత్య సరసన మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా కథానాయికగా టాలీవుడ్‌కు పరిచయమవుతోంది.

సమ్మర్ రేసులో..

ఈ సినిమాలో కేవలం సత్య మాత్రమే కాదు.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ వెన్నెల కిషోర్, వైవా హర్ష, విలక్షణ నటుడు అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరందరి కాంబినేషన్ ఈ సమ్మర్ రేసులో ‘జెట్లీ’ని ఒక హాట్ ఫేవరెట్‌గా నిలబెట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చెర్రీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

‘మత్తు వదలరా’ ఫేమ్ కాలా భైరవ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ కానుంది. ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ అందుకుంది, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి చూడదగ్గ క్లీన్ కామెడీ చిత్రమిది. రితేష్ రాణా స్టైలిష్ టేకింగ్, కలర్ గ్రేడింగ్ సినిమాను విజువల్ వండర్‌గా మార్చాయి. మొత్తానికి, సమ్మర్ కానుకగా వస్తున్న ఈ ‘జెట్లీ’ సత్య కెరీర్‌కు ఏ రేంజ్‌లో మైలేజ్ ఇస్తుందో చూడాలి. కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మే 1న థియేటర్లలో నవ్వుల పండగే.