- జనాభా లెక్కలపై ముదిరాజ్ మహాసభ అభ్యంతరం
బషీర్‌బాగ్, వెలుగు: రాష్ట్ర కులగణన నివేదికలో ముదిరాజ్ జనాభాను కేవలం 26.36 లక్షలుగా చూపించడం అన్యాయమని తెలంగాణ ముదిరాజ్ మహాసభ అభ్యంతరం వ్యక్తం చేసింది. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మహాసభ ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, నీలం రాములు ముదిరాజ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ గణాంకాలను తప్పుపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ సమగ్ర కుటుంబ సర్వేలోనే ముదిరాజ్ జనాభా 40 లక్షలుగా నమోదైతే, ఇప్పుడు పదేండ్ల తర్వాత అది 13 లక్షల మేర ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు.
ఈ గణాంకాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో అన్ని ముదిరాజ్ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ఇదే సమయంలో ముదిరాజ్‌లను బీసీ–డీ గ్రూపు నుంచి బీసీ–-ఏ గ్రూపులోకి మార్చాలని డిమాండ్ చేశారు. త్వరలోనే రాష్ట్రస్థాయిలో రెండు రోజుల పాటు మత్స్యకారుల శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.

