ముగిసిన ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు

ముగిసిన ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సఫాయ్ లో ముగిశాయి. అభిమాన నేతను చివరిసారి చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. అంత్యక్రియలకు డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ తో సహా.. పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. అధికారిక లాంఛనాలతో నేతాజీకి తుదివీడ్కోలు పలికారు. ములాయం సింగ్ కుమారుడు అఖిలేశ్ యాదవ్.. తండ్రి చితికి నిప్పంటించారు.

ములాయం సింగ్ మృతితో రాష్ట్రంలో 3 రోజులు సంతాప దినాలను యూపీ ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంత్యక్రియలకు హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్ నుంచి కమల్ నాథ్, చత్తీస్ గఢ్ సీం భూపేష్ అంతిమయాత్రలో పాల్గొన్నారు.

1960లో రాజకీ యాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ములాయం .. 1967లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1977లో రాష్ట్ర మంత్రిగా, 1980లో లోక్​దళ్​ ప్రెసిడెంట్​గా సేవలు అందించారు. తొలిసారి 1989లో యూపీ సీఎంగా ములాయం ఎన్నిక య్యారు. 1991లో మధ్యంతర ఎన్నికల్లో ములాయం పార్టీ ఓడిపోయింది. 1992లో సమాజ్ వాదీ పార్టీని స్థాపించి, బీఎస్పీ పొత్తుతో రెండో సారి సీఎం అయ్యారు. 2003లో మూడో సారి సీఎంగా ఎన్నికయ్యారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ములాయం ...నిన్న గురుగ్రామ్​లోని మేదాంత ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతూ తుదిశ్వాస విడిచారు.