4 కిలోల బంగారం, 8 కిలోల వెండి, 15 చోట్ల ఆస్తులు.. ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నరహరి చిట్టా ఇది !

4 కిలోల బంగారం, 8 కిలోల  వెండి, 15 చోట్ల ఆస్తులు.. ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నరహరి చిట్టా ఇది !

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నరహరికి చెందిన 2 లాకర్ల  Keys లేకపోవడంతో కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకొని బ్యాంక్ రూల్స్ ప్రకారమే శనివారం 2 లాకర్లను ఏసీబీ అధికారులు బ్రేక్ చేశారు. 2 లాకర్లలో ఒక కోటీ 50 లక్షల నగదు, 2 కిలోల 50 తులాల బంగారం గుర్తించారు. 12 బంగారు బిస్కెట్లు, నగలు ఉన్నాయి.

నరహరి ఇంట్లో దొరికిన నగదు 1 కోటీ 54 లక్షల రూపాయలు, బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ 5 కోట్లు, బ్యాంక్ బ్యాలెన్స్ 2 కోట్లు, లాకర్లో కోటీ 50 లక్షల రూపాయలను ఏసీబీ గుర్తించింది. మొత్తం బంగారం 4 కిలోలు, 8 కిలోల  వెండి, 15 చోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు లెక్క తేల్చారు.

సైబరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బిల్డింగులు, ఆపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లలో ఫ్లాట్లు, నరహరి భార్య పేరిట రెండు బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాకర్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న కుమారుడు, అత్తమామల పేరిట రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తుల డాక్యుమెంట్లు, కారును  స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుత మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ్యాల్యూ ప్రకారం ఈ ఆస్తుల విలువ సుమారు రూ.180 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నరహరిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి.. ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరచగా 14 రిమాండ్ విధించారు.

నరహరి కూడబెట్టిన ఇళ్లూ, భూముల చిట్టా ఇది:
* ఛత్రినాకలో ఇల్లు, గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
* రంగారెడ్డి జిల్లాలో ఐదు ఓపెన్ ప్లాట్లు
* మహేశ్వరంలో 1.24  ఎకరాల వ్యవసాయ భూమి
* పుప్పాలగూడలో హైరైజ్ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(2,500 ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ)
* నార్సింగిలో రెండు హైరైజ్ బిల్డింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఒక్కోటి 1,860 ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ)
* రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెసిడెన్షియల్ ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

2025 ఆగస్టులో మల్టీజోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 డిప్యూటీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నరహరి పదోన్నతి పొందాడు. ప్రభుత్వ, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూముల సర్వేలకు సంబంధించి నరహరిపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో భూముల అమ్మకాలకు సంబంధించిన సర్వేల సమయంలోను భారీగా అవకతవకలకు పాల్పడినట్టు తెలిసింది. ఇందులో భాగంగా నరహరికి ఇటీవల పెద్ద మొత్తంలో నగదు చేరినట్టు ఏసీబీకి సమాచారం అందింది. ఈ సమాచారంతో తనిఖీలు చేయగా నరహరి అక్రమాస్తుల గుట్టు బయటపడింది.