ములుగు, వెలుగు : రాబోయే పోలీస్ నోటిఫికేషన్ కోసం ములుగు జిల్లా యువతకు ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. అర్హులైన అభ్యర్థులకు బుధవారం ములుగులోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శారీరక పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ మాట్లాడుతూ శారీరక పరీక్షలలో అర్హత పొందిన అభ్యర్థులకు ఉచిత వసతితో కూడిన శిక్షణ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సదానందం, ములుగు సీఐ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
