- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నిజామాబాద్, వెలుగు : ‘సుమారు 85 శాతం మున్సిపాలిటీల్ల్ కాంగ్రెస్ విజయం సాధించింది, సీఎం రేవంత్‌రెడ్డి పాలనకు ప్రజలు రెఫరెండం లాంటి ఫలితం ఇచ్చారు’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్‌కు వచ్చిన ఆయన డీసీసీ ఆఫీస్‌లో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు మాత్రం కాంగ్రెస్ పట్ల విశ్వాసాన్ని ప్రకటించారన్నారు.
మత రాజకీయాలతో లబ్ధి పొందాలని చూసిన బీజేపీకి బుద్ధి చెప్పారని, బీఆర్ఎస్ను మరోసారి ఇంటికి పంపించారన్నారు. కాంగ్రెస్ సర్కార్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. ఉత్తర తెలంగాణలో మతం ప్రాతిపాదికన విభజన తేవాలని చూసిన బీజేపీని కాంగ్రెస్ అడ్డుకుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం అద్భుత ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
నిజామాబాద్ కార్పొరేషన్లో మజ్లిస్ పొత్తుతో మేయర్ పదవి దక్కించుకున్నామని, సాధారణ గృహిణి అయిన ఉమారాణిని మేయర్ చేశామని చెప్పారు. రెండు దశాబ్దాల తర్వాత నిజామాబాద్‌లో కాంగ్రెస్ గెలవడం సంతోషంగా ఉందన్నారు. నిజామాబాద్, కరీంనగర్లో మరిన్ని సీట్లు గెలుస్తామని భావించామని, బీజేపీ విభజన రాజకీయాల కారణంగా కొంత నష్టం కలిగిందన్నారు. అంతకుముందు మేయర్ ఉమారాణిని సన్మానించారు. సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, నుడా చైర్మన్ కేశవేణు, నరాల రత్నాకర్
పాల్గొన్నారు.
