- మున్సిపల్ చైర్పర్సన్ పదవులను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల వ్యూహం
- జనగామ బీసీ జనరల్, స్టేషన్ ఘన్పూర్ ఎస్సీ జనరల్‌కు రిజర్వ్
జనగామ, వెలుగు: మున్సిపల్ చైర్పర్సన్ పదవులను దక్కించుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. బీసీ, ఎస్సీలకు రిజర్వ్అయిన స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థి గెలవకుంటే సీన్ రివర్స్ కాకుండా ఉండేందుకు.. జనరల్స్థానాల్లోనూ ఆ రెండు వర్గాలకు చెందిన అభ్యర్థులను పోటీ చేయిస్తున్నాయి.
జిల్లాలో 2 మున్సిపాలిటీలు
జనగామ జిల్లాలోని 2 మున్సిపాలిటీల్లో 48 వార్డులు ఉన్నాయి. జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పదవి బీసీ జనరల్‌కు, స్టేషన్ ఘన్పూర్ చైర్పర్సన్పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వ్అయ్యాయి. ఎస్టీలకు 2, ఎస్సీలకు 11, బీసీలకు 12, జనరల్‌కు 13 వార్డులు కేటాయించారు.
జనగామ జనరల్ వార్డుల్లో బీసీలు
జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వ్‌కాగా.. ఈ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉన్నాయి. వీటిలో ఎస్టీకి 1, ఎస్సీలకు 6, బీసీలకు 9, జనరల్‌కు 14 రిజర్వ్అయ్యాయి. దీంతో ప్రధాన పార్టీలు చైర్పర్సన్ పీఠం దక్కించుకోవాలన్న వ్యూహంతో జనరల్వార్డుల్లో బీసీలను రంగంలోకి దించాయి. 9వ వార్డులో బీజేపీ, బీఆర్ఎస్,11వ వార్డులో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ,12వ వార్డులో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బీసీలకు టికెట్ ఇచ్చాయి. 14వ వార్డులో కాంగ్రెస్, బీజేపీ, 15వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్, 16వ వార్డులో బీజేపీ, బీఆర్ఎస్,19వ వార్డులో కాంగ్రెస్, 21వ వార్డులో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, 22వ వార్డులో కాంగ్రెస్, 23వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్, 24వ వార్డులో బీఆర్ఎస్, బీజేపీ, 28వ వార్డులో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, 30వ వార్డులో బీజేపీ బీసీ అభ్యర్థులను పోటీ చేయిస్తున్నాయి.
స్టేషన్‌ఘన్‌పూర్ లో ఎస్సీలు
స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ చైర్పర్సన్పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయింది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 18 వార్డులు ఉన్నాయి. వీటిలో ఎస్టీకి 1, ఎస్సీలకు 5, బీసీలకు 3, జనరల్‌కు 9 కేటాయించారు. అయితే చైర్పర్సన్ పదవి దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు జనరల్ వార్డుల్లో ఎస్సీ అభ్యర్థులను పోటీకి దించాయి. జనరల్ వార్డు 5లో కాంగ్రెస్ పార్టీ, 9వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, బీఎస్పీ, 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీఎస్సీ అభ్యర్థులకు టికెట్ఇచ్చాయి.
జనరల్ వార్డుల్లో మహిళలు కూడా
మహిళలకు రిజర్వ్ అయిన వార్డుల్లోనే కాదు.. జనరల్ వార్డుల్లోనూ మహిళలు పోటీ చేస్తూ రాజకీయాల్లో తామేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. జనగామలోని ఎస్టీ, ఎస్సీ జనరల్ వార్డుల్లో బీజేపీ మహిళలకు టికెట్లు ఇచ్చింది. జనరల్ వార్డు 13లో బీఆర్ఎస్ తరఫున,14వ వార్డులో కాంగ్రెస్, 29వ వార్డులో బీఆర్ఎస్ తరఫున మహిళలు పోటీ చేస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లోని ఎస్టీ జనరల్ వార్డు 16లో బీజేపీ మహిళను పోటీకి నిలిపింది.
