మంత్రిని కాకుంటే.. డైరెక్ట్ గా సీఎంనే అవుతా : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

మంత్రిని కాకుంటే.. డైరెక్ట్ గా సీఎంనే అవుతా : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
  •     మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డి వ్యాఖ్య

యాదాద్రి, వెలుగు: "ఇచ్చిన మాటకు మంత్రిని చేస్తరా..  చేయండి. చేయకుంటే బాధేం లేదు. మాట్లాడేమీ లేదు. మంత్రిని కాకుంటే డైరెక్ట్​గా ముఖ్యమంత్రిని అవుతా" అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్​ మున్సిపాలిటీలో కాంగ్రెస్​ గెలుపు సాధించడంతో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆయన మాట్లాడారు.  

ఈ సందర్భంగా తనకు మంత్రిపదవి ఇస్తానంటూ అధిష్ఠానం ఇచ్చిన హామీని మరోసారి గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో తనకు మంచి పదవి వస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. ఒకవేళ మంత్రి పదవి కాకుంటే సీఎం పదవి వస్తుందన్నారు. దానికి టైం రానుందని పేర్కొన్నారు.