
సికింద్రాబాద్ : రూ.5 వేల కోసం స్నేహితుడిని హత్యచేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోయిన్ పల్లి సీఐ రాజేష్ వివరాల ప్రకారం.. బోయిన్ పల్లి చిన్నతోకట్టలో ఉండే అజయ్ కుమార్(27), వికాస్ తివారి(24) స్నేహితులు. తివారి వద్ద రూ.5 వేలు అప్పుగా తీసుకున్న అజయ్… తిరిగి ఇవ్వలేదు. ఈనెల 14వ తేదీన డబ్బులు అడగడానికి అజయ్ ఇంటికి వెళ్లాడు వికాస్ తివారీ. ఇద్దరు కలసి అజయ్ ఇంటి సమీపంలో అర్ధరాత్రి వరకు మందు తాగారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని వికాస్… అజయ్ తో గొడవ పడ్డాడు. మత్తులో ఉండటంతో.. క్షణికావేశంలో అజయ్ తలపై బండరాయితో బాది హత్యచేశాడు.
హంతకుడిని పోలీసులకు పట్టించిన హతుడి సెల్ ఫోన్
మృతుడి సెల్ ఫోన్లను తీసుకొని ఢిల్లీకి పారిపోయాడు వికాస్. 5 రోజుల కింద సిటీకి తిరిగొచ్చిన వికాస్ ను… అజయ్ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పట్టుకొన్నారు.