హైదరాబాద్‌సిటీ, వెలుగు: మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్పేరుతో తమ ఇండ్లను కూల్చవద్దంటూ మధుపార్క్రిడ్జ్ వాసులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ఆదివారం ఇక్కడ నిర్వహించిన సమావేశానికి సాయిరామ్‌నగర్, గంధంగూడ, హైదర్షా కోట్వాసులు పాల్గొని సంఘీభావం తెలిపారు. సామాజిక కార్యకర్తలు సజయ, జీవన్ కుమార్, సీనియర్ జర్నలిస్టు కె. శ్రీనివాస్, తులసీ చందు, విద్యావేత్త ఘంటా చక్రపాణి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కొందరు మాజీ సైనికులు కూడా కలిసి సంఘీభావం తెలిపారు. వందల మంది పిల్లలు ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమ ఇండ్లను కూల్చవద్దన్నారు. తమ ఇండ్లను కాపాడాలని రాహుల్‌గాంధీకి పోస్ట్కార్డులు పంపనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా వాళ్లు రాసిన కార్డులను ప్రదర్శించారు. మూసీ జన ఆందోళన్, హ్యూమన్ రైట్స్ ఫోరం, సేవ్మూసీ మూవ్మెంట్, ఫ్రైడేస్‌ఫర్ ఫ్యూచర్, క్లైమేట్ఫ్రంట్తెలంగాణ వంటి ప్రజా సంఘాలు మూసీ అభివృద్ధి ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ నిర్వాసితులకు సంఘీభావం తెలిపాయి.
