వచ్చే ఏడాది పంట రుణాలు 1.12 లక్షల కోట్లు

వచ్చే ఏడాది పంట రుణాలు 1.12 లక్షల కోట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చే ఆర్థిక సంవత్సర (2023 – 24) రుణ ప్రణాళికను నాబార్డు ప్రకటించింది.వచ్చే ఏడాది మొత్తం రూ.1,85,326.68 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 61 శాతం నిధులు అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌కే కేటాయించింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల రుణ లక్ష్యం రూ.1,12,762 కోట్లుగా నిర్ణయించింది. ఈ క్రెడిట్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగానే రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు నాబార్డు సూచించింది. గురువారం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో నాబార్డు లోన్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌ను ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు విడుదల చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌, నాబార్డ్‌‌‌‌‌‌‌‌ సీజీఎం సుశీల చింతల పాల్గొన్నారు. 

పంట రుణాలు 73 వేల కోట్లు... 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022 – 23) లోన్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ రూ.1,66,257.93 కోట్లు కాగా.. వచ్చే ఏడాదికి గాను రూ.19,068.78 కోట్లు ఎక్కువ కేటాయించారు. 2022–23లో అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌కు రూ.1,01,030.04 కోట్లు కేటాయించగా, వచ్చే ఏడాదికి గాను రూ.1,12,762.59 కోట్లు కేటాయించారు. అంటే రూ.11,732.55 కోట్లు పెంచారు. మొత్తం లోన్లలో పంట రుణాలకు 40 శాతం, ఎంఎస్‌‌‌‌‌‌‌‌ఎంఈలకు 29 శాతం,  అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ టర్మ్‌‌‌‌‌‌‌‌ లోన్లకు 10 శాతం, అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ సహాయ కార్యకలాపాలకు 9 శాతం, అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాకు 2 శాతం, ఇతర రంగాలకు మరో 10 శాతం నిధులు కేటాయించారు. అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ సెక్టార్ లో పంట రుణాల కింద రూ.73,436 .72 కోట్లు ఇవ్వాలని నాబార్డు టార్గెట్ పెట్టుకుంది. వాటర్‌‌‌‌‌‌‌‌ రీసోర్సెస్‌‌‌‌‌‌‌‌ కోసం రూ.1,245.25 కోట్లు, ఫామ్‌‌‌‌‌‌‌‌ మెకనైజేషన్‌‌‌‌‌‌‌‌కు రూ.4,496.36 కోట్లు హార్టీ,సెరీ కల్చర్‌‌‌‌‌‌‌‌ కు రూ.3,760.23 కోట్లు కేటాయించింది. డెయిరీ రంగానికి రూ.2,771.49 కోట్లు, పౌల్ట్రీ రంగానికి రూ.1,456.04 కోట్లు టార్గెట్‌‌‌‌‌‌‌‌ పెట్టుకుంది. అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ కల్పనకు రూ.4,562.77 కోట్లు, వ్యవసాయ సహాయ కార్యకలాపాలకు రూ.16,848.19 కోట్లు కేటాయించింది.