మా డీవోర్స్ కి కారణం ఆ రూమర్సే.. చై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మా డీవోర్స్ కి కారణం ఆ రూమర్సే..  చై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రోజు మీడియాలో మనం చాలా రూమర్స్ చూస్తూనే ఉంటాం. ఆ.. అవి వస్తూనే ఉంటాయిలే అని చాలా మంది వాటిని పట్టించుకోరు. కానీ.. ఈ రూమర్స్ వల్ల ఒక స్టార్ జంట విడిపోయిందంటే మీరు నమ్ముతారా? అవును ఇది నిజం. ఆ జంట మరెవరో కాదు. నాగ చైతన్య,సమంత. మీడియాలో వచ్చిన రూమర్స్ కారణంగానే తాము విడిపోయామని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు నాగ చైతన్య. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

నాగ చైతన్య హీరోగా వస్తున్న  లేటెస్ట్ మూవీ "కస్టడీ". ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్ లో బాగంగా.. ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో బాగంగా.. సమంతతో విడాకుల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "మేము విడిపోయి రెండు సంవత్సరాలు అయ్యింది. అధికారికంగా విడాకులు తీసుకుని ఏడాది పూర్తయ్యింది. విడాకుల తర్వాత మా ఇద్దరి జీవితాలు వేర్వేరుగా కొనసాగుతున్నాయి. ఇద్దరం వేరైనా ఆమెతో కలిసి ఉన్న రోజులను చాల గౌరవంగానే చూస్తాను. నిజానికి సమంత లవ్లీ ఉమెన్. ఆమె అన్ని ఆనందాలకు అర్హురాలు కానీ.. మీడియా ఊహాగానాల కారణంగానే  మా మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి పెద్దవై చివరికి విడిపోవాల్సి వచ్చింది.

నేను మొదట్లో రూమర్స్ గురించి అంతగా పట్టించుకోలేదు కానీ, ఆ తర్వాత పరిస్థితులు మారాయి. ప్రస్తుతం నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. జీవితం చాలా బాగుంది. జీవితంలో ప్రతి అంశం నేర్చుకోదగినదే. నేను నా గతం, నా వర్తమానం, భవిష్యత్తును సానుకూలతతో చూస్తాను. ఏది జరిగినా నా మంచికే అనుకుంటాను” అని చెప్పుకొచ్చారు చైతన్య.