లవర్ ని కొట్టిన యువకుడు..సారీ చెప్పించిన హీరో

లవర్ ని కొట్టిన యువకుడు..సారీ చెప్పించిన హీరో

సినీ హీరో నాగశౌర్య చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్ మారింది. చూడ్డానికి ఎప్పుడూ సైలెంట్ గా కనిపించే ఈ స్మార్ట్ హీరో.. ఓ అమ్మాయిపై యువకుడు చేయి చేసుకోవడాన్ని సహించలేకపోయాడు. అందర్లా చూస్తూ ఊరుకోకుండా రీల్ హీరోనే కాదు తన ప్రశ్నలతో రియల్ హీరో అనిపించుకున్నాడు. హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఒక ప్రేమ జంట గొడవకు దిగారు. రోడ్డు మీద ఇద్దరు లవర్స్ గొడవ పడుతుండగా.. అబ్బాయి బలంగా అమ్మాయి చెంపమీద కొట్టాడు. దీంతో అటుగా వెళ్తున్న నాగశౌర్య... వెంటనే తన కారు దిగి వాళ్ల వద్దకు వచ్చాడు. ‘ఆ అమ్మాయిని ఎందుకు కొడుతున్నావ్’ అని అడిగాడు. దానికి ఆ యువకుడు ‘నా లవర్ నా ఇష్టం. నీకెందుకు’ అని పొగరుగా సమాధానం ఇచ్చాడు. దీంతో నాగశౌర్య ఆ అబ్బాయి చేయి పట్టుకుని ‘మర్యాదగా అ అమ్మాయికి సారీ చెప్పు’ అని గట్టిగా హెచ్చరించాడు. ఆ క్రమంలోనే చుట్టూ ఉన్న వారంతా గుమికూడి, నాగశౌర్యకు సపోర్ట్ చేశారు. లవర్ అయితే ఏంటీ.. కొడతావా.. అని అందరూ ఆ యువకున్ని నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.