V6 News

మహిళల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ :  డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ 

మహిళల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ :  డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ 

నల్గొండ, వెలుగు :  మహిళల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ -అని నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత అన్నారు. ఆదివారం యాదవ సంఘం భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరా గాంధీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో సాగిందని, సోనియా గాంధీ హయాంలో బహుజనుల అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు చేపట్టారని గుర్తుచేశారు.

ప్రతిభా పాటిల్‌‌‌‌ను దేశ తొలి మహిళా రాష్ట్రపతిని చేసిన ఘనత కాంగ్రెస్‌‌‌‌దేనని, 40 ఏండ్ల బీజేపీ చరిత్రలో మహిళలకు అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులో డీలిమిటేషన్ అంశాన్ని చేర్చడం దక్షిణ భారతదేశాన్ని, చిన్న రాష్ట్రాలను దెబ్బతీసే రాజకీయ కుట్ర అని ఆరోపించారు. 2023లో ఆమోదించిన బిల్లును ప్రస్తుత సభ్యుల సంఖ్య ఆధారంగా యథాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఓబీసీ సెల్ చైర్మన్ జిల్లపల్లి పరమేశ్ పాల్గొన్నారు.