నల్గొండ, వెలుగు: ఐకాన్ హాస్పిటల్ అత్యంత క్లిష్టమైన 100 బ్రెయిన్ ట్యూమర్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసింది. ఒకప్పుడు జిల్లాలో ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ అని నిర్ధారణ అయితే, హైదరాబాద్ వెళ్లేవారు. అక్కడ నెలల తరబడి ఉంటూ లక్షలాది రూపాయల వైద్య ఖర్చులు భరించలేక అనేక కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా చితికిపోయేవి. ఆ కష్టాలను దూరం చేయాలనే దృఢ సంకల్పంతో ఐకాన్ హాస్పిటల్ నల్గొండలోనే అత్యాధునిక న్యూరో సర్జరీ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
హైదరాబాద్‌లో దాదాపు రూ. 10 లక్షల వరకు ఖర్చయ్యే శస్త్రచికిత్సలను, ఐకాన్ హాస్పిటల్‌లో అత్యంత తక్కువ ఖర్చుతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకువచ్చిందని హాస్పిటల్ ప్రతినిధులు తెలిపారు. అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ రాజేశ్, డాక్టర్లు శశాంక కోడ, సాయి మౌనికి చెరుకూరి, సాయి లావణ్య కడిమి నేతృత్వంలోని న్యూరో సర్జరీ, క్రిటికల్ కేర్ బృందం ఈ విజయాన్ని సాధించింది.
