నల్గొండ, వెలుగు : అమెరికాలో జరిగిన యాక్సిడెంట్‌లో నల్గొండ జిల్లాకు చెందిన యువతి చనిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్‌రెడ్డి కూతురు నవ్య (24) ఎంఎస్ చేసేందుకు సంవత్సరం కింద అమెరికా వెళ్లింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో నవ్య అక్కడికక్కడే చనిపోగా, మిగతా ఇద్దరికి గాయాలు అయ్యాయి.
ఈ విషయాన్ని నవ్య స్నేహితులు కుటుంబ సభ్యులకు చెప్పారు. నవ్య మృతి వార్త తెలుసుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. నవ్య మృతి బాధాకరం అని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు.
