హైదరాబాద్, వెలుగు: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి జనం ఇప్పటికే సిటీకి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు విరామం లేకుండా చేపమందు పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో రెండ్రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు వెహికల్స్ డైవర్షన్ ఉంటుందన్నారు. ఈ మేరకు సిటీ ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు బుధవారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చేప ప్రసాదానికి వచ్చేవారి వెహికల్స్ కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు.
డైవర్షన్స్ ఇలా..
ఎంజే మార్కెట్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వైపు వెళ్లే వెహికల్స్‌ను అబిడ్స్ జీపీవో, నాంపల్లి స్టేషన్‌మీదుగా దారి మళ్లిస్తారు.
బేగంబజార్ ఛత్రి, ఎంజే బ్రిడ్జి నుంచి నాంపల్లి వైపు వచ్చే వెహికల్స్‌ను దారుసలాం, ఏక్ మినార్ వైపు దారి మళ్లిస్తారు.
అసెంబ్లీ జంక్షన్ నుంచి నాంపల్లి స్టేషన్, అఫ్జల్‌గంజ్ వైపు వచ్చే వెహికల్స్ ను బషీర్బాగ్ఏఆర్ పెట్రోల్‌పంప్, బీజేఆర్ విగ్రహం మీదుగా పంపిస్తారు.
పార్కింగ్ ఏరియాలు
చేప ప్రసాదం కోసం వచ్చే వారి వెహికల్స్‌ను నాంపల్లిలోని గృహకల్ప, గగన్ విహార్, చంద్ర విహార్, ఎంఏఎం గర్ల్స్ జూనియర్ కాలేజీ, ఇంటర్ బోర్డు వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేస్‌లో పార్క్ చేయాల్సి ఉంటుంది.
బస్సులు, వ్యాన్లను గోషామహల్ పోలీస్ స్టేడియంలో పార్క్ చేయాలి.
ప్రభుత్వ వెహికల్స్, బైక్‌లను భీమ్ నగర్, గృహకల్ప, బీజేపీ ఆఫీస్ వద్ద పార్క్ చేయాలి.
పాస్‌లు ఉన్న వీఐపీ కార్లను సీడబ్ల్యూసీ గోడౌన్స్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేయాలి.

