వరుస డ్యూయల్ రోల్ బ్లాక్ బస్టర్స్.. ఆ రికార్డ్ కొట్టిన ఒకేఒక్కడు బాలయ్య

వరుస డ్యూయల్ రోల్ బ్లాక్ బస్టర్స్.. ఆ రికార్డ్ కొట్టిన ఒకేఒక్కడు బాలయ్య

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు మాస్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఆయన మాస్ డైలాగ్స్, మాస్ యాక్షన్ ను ఎంజాయ్ చేసేందుకే సినిమాలు చూసేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఇక సాంగ్స్ లో ఆయన వేసే స్టెప్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. రీసెంట్ గా వీరసింహరెడ్డి(Veerasimhareddy) సినిమాతో మరో మాస్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఈ సినిమా రీసెంట్ గా 175 డేస్ పూర్తి చేసుకొని.. బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mytri movie makers) నిర్మించిన ఈ సినిమాను.. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని(Gopichand malineni) తెరకెక్కించారు.

అయితే వీరసింహారెడ్డి హిట్టుతో ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేశారు బాలయ్య. అదేంటంటే.. ఒక హీరో వరుసగా డబుల్ యాక్షన్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడం. టాలీవుడ్ లో ఈ రికార్డ్ ఉన్న ఒకేఒక్క హీరో బాలయ్య. ఆయన చేసిన ప్రీవియస్ రెండు సినిమాలు అఖండ(Akhanda), వీరసింహారెడ్డి. ఈ రెండు సినిమాల్లో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించారు. అంతేకాదు.. ఈ రెండు సినిమాలు బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. దీంతో వరుసగా రెండు డ్యూయల్ రోల్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఏకైక హీరోగా బాలయ్య రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ న్యూస్ తెల్సుకున్న బాలయ్య ఫ్యాన్స్.."టాలీవుడ్ లో ఎలాంటి రికార్డ్ అయినా సెట్ చేయాల్సింది బాలయ్యనే.. జై బాలయ్య(Jai Balayya)" అంటూ మాస్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం బాలకృష్ణ, అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్ లో "భగవంత్ కేసరి(Bhagavanth Kesari)" అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వినాయకచవితికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తారో చూడాలి.