V6 News

సీబీఎస్‌‌ఈ టెన్త్‌‌ ఫలితాల్లో నారాయణ హవా.. 161 బ్రాంచీలలో 100% ఉత్తీర్ణత

సీబీఎస్‌‌ఈ టెన్త్‌‌ ఫలితాల్లో నారాయణ హవా.. 161 బ్రాంచీలలో 100% ఉత్తీర్ణత

హైదరాబాద్, వెలుగు: సీబీఎస్‌‌ఈ పదో తరగతి ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థలు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. దేశవ్యాప్తంగా తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని నారాయణ సంస్థ డైరెక్టర్లు పి. సింధూర నారాయణ, పి. శరణి నారాయణ ప్రకటించారు. పంజాబ్‌‌కు చెందిన రిద్ది శర్మ 500 మార్కులకు గాను 499 మార్కులతో సంచలనం సృష్టించగా.. నైతిక్ దంగి, సానా సమీర్ గౌడ్, బైజయంతి బెనర్జీ, బి. సంజనా రెడ్డి, మోహిప్ బోస్, ఎ. సజీవన్ 498 మార్కులతో టాప్ ర్యాంకుల్లో నిలిచారని వివరించారు.

498 ఆపై మార్కులు ఏడుగురు, 495 ఆపై మార్కులు 47 మంది, 490 ఆపై మార్కులు 210 మంది సాధించారని చెప్పారు. మొత్తం 3,732 మంది విద్యార్థులు 450 కంటే ఎక్కువ మార్కులు సాధించి సంస్థ రికార్డును సుస్థిరం చేశారని వెల్లడించారు. ఓవరాల్‌‌గా 99.6% ఉత్తీర్ణత నమోదు కాగా.. 161 బ్రాంచీల్లో 100% ఫలితాలు వచ్చాయన్నారు.