నారాయణపేట జిల్లా నర్వ మండల పరిధిలోని యాంకి గ్రామంలో అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో ఇప్పటివరకు ఉన్న అంగన్ వాడీ కేంద్ర భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో సరికొత్తగా ఆలోచించి కంటెయినర్ కు అవసరమైన మార్పులు చేసి అంగన్ వాడీ కేంద్రంగా మార్చారు. సుమారు రూ. 5 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన ఈ కంటెయినర్ అంగన్ వాడీ కేంద్రాన్ని గురువారం నారాయణపేట కలెక్టర్ ప్రియాంక సర్పంచ్ కల్యాణితో కలిసి ప్రారంభించారు. సమస్యకు తక్షణ పరిష్కారంగా చేపట్టిన ఈ సరికొత్త ఆలోచనపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
