రియా చ‌క్ర‌వ‌ర్తి అరెస్ట్..కోర్ట్ కి హాజ‌రుప‌ర‌చ‌నున్న అధికారులు

రియా చ‌క్ర‌వ‌ర్తి అరెస్ట్..కోర్ట్ కి హాజ‌రుప‌ర‌చ‌నున్న అధికారులు

డ్ర‌గ్స్ స్మగ్లింగ్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు  (ఎన్ సీబీ) రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన మరో ముగ్గురు నిందితులతో పాటు ఆమెను సెప్టెంబర్ 9 న కోర్టుకు హాజరుపర‌చ‌నున్నారు. తదుపరి విచారణ కోసం ఈ నలుగురినీ పోలీసు రిమాండ్‌లో ఉంచాల్సిన అవసరం ఉందని ఎన్‌సీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

డ్ర‌గ్స్ స్మగ్లింగ్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన మరో ముగ్గురు నిందితులతో పాటు ఆమెను సెప్టెంబర్ 9 న కోర్టుకు హాజరుపర‌చ‌నున్నారు. తదుపరి విచారణ కోసం ఈ నలుగురినీ పోలీసు రిమాండ్‌లో ఉంచాల్సిన అవసరం ఉందని ఎన్‌సీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది

ఇదిలా ఉంటే రియా చక్రవర్తిని ఇవాళ‌ డ్ర‌గ్స్ స్మగ్లింగ్ కేసు విష‌యంలో మూడో సారి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ప్ర‌శ్నించారు. ఉద‌యం 10గంట‌ల నుంచి ప్రారంభ‌మైన విచార‌ణ‌లో కొత్త‌పేర్లు వెలుగులోకి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

దీంతో పాటు గ‌త 2 సంవత్సరాలలో ముంబై మరియు పూణే పోలీసులు అరెస్ట్ చేసిన డ్రగ్ స్మ‌గ్ల‌ర్లను ఎన్‌సీబీ అధికారులు విచారించ‌నున్నారు. విచార‌ణ‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రియా చక్రవర్తి మరియు షోయిక్ స్నేహితులు ఉన్నారా అనే విష‌యాన్ని ప‌రిశీలించ‌నున్నారు. అదనంగా వారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేయ‌నున్నారు.