అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ హామీలు అమలు : రాహుల్ గాంధీ

అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ హామీలు అమలు :   రాహుల్ గాంధీ

దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.  బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందన్నారు.  రాజ్యాంగాన్ని మార్చడం అంటే రిజర్వేషన్లను ఎత్తివేయడమే అని చెప్పారు.  మోదీ తన దోస్తుల కోసం రూ. 16 లక్షల కోట్ల నిధులను  మాఫీ  చేశారని తెలిపారు.   రూ. 16 లక్షల కోట్లతోని 25కోట్ల మందికి ఉపాధి కల్పించవచ్చునని చెప్పారు.  నిర్మల్ లో జరిగిన జనజాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.  

తెలంగాణలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణలో ఇచ్చిన హామీలను దేశమంతా  అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళ అకౌంట్లో ఏడాదికి రూ. లక్ష వేస్తామన్నారు.  మోదీ నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు.  

తాము అధికారంలోకి వస్తే  నిరుద్యోగులకు ఉద్యోగాన్ని హక్కుగా మారుస్తామన్నారు. కేంద్రంలోని 30లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.  తెలంగాణలో పోడు భూముల సమస్యను త్వరలోనే తీరుస్తామన్నారు రాహుల్ గాంధీ.  గత బీఆర్ఎస్ సర్కార్ ఆదివాసుల్ని సర్వనాశనం చేసిందన్నారు. ఉపాధి హామీ కింద రోజుకు  రూ.  400 దినసరి కూలీ ఇస్తామని చెప్పారు.   అధికారంలోకి రాగానే కులగణన చేసి తీరుతామని తెలిపారు.