- ఇరాన్ దాడిలో ఇండియన్లు గాయపడటంపై మోదీ ఆందోళన
న్యూఢిల్లీ: యూఏఈలోని ఫుజైరా పెట్రోలియం ఇండస్ట్రీస్ జోన్‌పై ఇరాన్ దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఈ దాడిలో ముగ్గురు భారతీయులు గాయపడటంపై ఆయన మంగళవారం ‘ఎక్స్’లో ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదు. ఈ క్లిష్ట సమయంలో యూఏఈకి భారత్ అండగా ఉంటుంది. అంతర్జాతీయ ఇంధన భద్రత కోసం హార్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు సాగడం అత్యంత కీలకం” అని తెలిపారు. ఈ దాడి అంగీకరించలేని చర్య అని విదేశాంగ శాఖ కూడా ఒక ప్రకటనలో పేర్కొంది.
