ఎంప్లాయ్‌మెంట్‌ పాలసీ ఈ ఏడాదిలోనే!

ఎంప్లాయ్‌మెంట్‌ పాలసీ ఈ ఏడాదిలోనే!

సర్వేలు, లేబర్‌‌‌‌ చట్టాల అమలు తర్వాత పాలసీ తయారీ

న్యూఢిల్లీ: ఎంప్లాయ్‌‌మెంట్ జనరేషన్‌‌ను వేగవంతం చేసేందుకు ఈ ఏడాది డిసెంబర్‌‌‌‌లోపు నేషనల్‌‌ ఎంప్లాయ్‌‌మెంట్‌‌ పాలసీ(ఎన్‌‌ఈపీ)ని తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోంది. తాజాగా ఆమోదం పొందిన నాలుగు లేబర్‌‌‌‌ చట్టాలు ఏప్రిల్‌‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ తర్వాత నాలుగు సర్వేలను పూర్తి చేసి ఎన్‌‌ఈపీని రెడీ చేస్తామని మినిస్ట్రీ తెలిపింది. దేశంలో ఉద్యోగ అవకాశాలను పెంచడంపై ఈ పాలసీ దృష్టి పెడుతుంది.  స్కిల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌, ఉద్యోగాలను ఎక్కువగా క్రియేట్ చేసే సెగ్మెంట్లలోకి ఇన్వెస్ట్‌‌మెంట్లను ఆకర్షించడం వంటివి ఈ పాలసీ చూస్తుంది. కిందటేడాది ఇండస్ట్రియల్‌‌ రిలేషన్స్‌‌, సోషల్‌‌ సెక్యూరిటీ, ఆక్యుపేషనల్‌‌(వృత్తి) హెల్త్‌‌ సేఫ్టీ అండ్‌‌ వర్కింగ్ కండీషన్స్‌‌కు సంబంధించిన చట్టాలను పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగుల వేతనాలకు సంబంధించి తీసుకొచ్చిన చట్టానికి పార్లమెంట్‌‌ ఆమోదం తెలపడంతో పాటు  రూల్స్‌‌ను తయారు చేయడం కూడా పూర్తయ్యింది. కానీ మొత్తం నాలుగు చట్టాలను ఒకేసారి అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ చట్టం ఇంకా అమలుకాలేదు.