V6 News

ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం

ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 24న నిర్వహించే జాతీయ పంచాయతీరాజ్ వేడుకలను రాష్ట్రంలో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మార్గదర్శకాలను అనుసరించి కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీల్లో గ్రామ సభలను ఏర్పాటు చేయాలని, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధిపై చర్చించాలని పేర్కొంది.