రాష్ట్రపతి భవన్లో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఘనం జరిగింది. 2019 సంవత్సరానికి గానూ జాతీయ క్రీడా అవార్డులు అర్జున్ అవార్డు, ద్రోణాచార్య అవార్డు, రాజీవ్ ఖేల్ రత్నఅవార్డులకు ఎంపికైన ప్లేయర్లకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అవార్డులు అందజేశారు.
ఖేల్ రత్న అవార్డు గ్రహీతలు: దీపా మాలిక్(పారా అథ్లెటిక్స్), బజరంగ్ పూనియా(రెజ్లింగ్)
అర్జున అవార్డు గ్రహీతలు: సాయి ప్రణీత్(బ్యాడ్మింటన్), రవీంద్ర జడేజా(క్రికెట్), మహమ్మద్ అనాస్ యాహియా(అథ్లెటిక్స్), గురుప్రీత్ సింగ్ సంధు(ఫుట్‌బాల్), చింగ్‌లెన్సెనా సింగ్(హాకీ), ఎస్. భాస్కరన్(బాడీ బిల్డింగ్), సోనియా లాథర్(బాక్సింగ్), అజయ్ థాకూర్(కబడ్డీ), అంజుమ్ మౌడ్గిల్(షూటింగ్), తాజేందర్ పాల్ సింగ్ (టేబుల్ టెన్నిస్), పూజా దండా(రెజ్లింగ్), ఫౌడా మీర్జా(ఈక్వెస్ట్రియన్), సిమ్రాన్ సింగ్ షేర్‌గిల్ (పోలో), పూనమ్ యాదవ్ (క్రికెట్), స్వప్న బర్మన్(అథ్లెటిక్స్), సుందర్ సింగ్ గుజార్(పారా స్పోర్ట్స్ అథ్లెటిక్స్),గౌరవ్ సింగ్ గిల్( మోటార్ స్పోర్ట్స్)
ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు(రెగులర్ కేటగిరీ): మోహిందర్ సింగ్ థిల్లాన్(అథ్లెటిక్స్), సందీప్ గుప్తా(టేబుల్ టెన్నిస్), విమల్ కుమార్(బ్యాడ్మింటన్)
ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు(లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్): సంజయ్ భరద్వాజ్(క్రికెట్), రాంబీర్ సింగ్ ఖొక్కార్(కబడ్డీ), మెజ్బాన్ పటేల్(హాకీ)
ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలు: మనోజ్ కుమార్(రెజ్లింగ్), సీ. లాల్‌రెమ్ సంగా(ఆర్చెరీ), అరూప్ బాసక్(టేబుల్ టెన్నిస్).
భారత హాకీ దిగ్గజం.. దివంగత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ క్రీడా పురస్కారాల విజేతలకు రాష్ట్రపతి భవన్‌లో అవార్డులు అందజేస్తారు.
