- ఎన్డీయే కూటమికి 285-325 ఎంపీ సీట్లు
- టైమ్స్ నౌ-నవభారత్’ సర్వేలో వెల్లడి
- కాంగ్రెస్ కూటమికి 111-149 సీట్లు
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలొస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ‘టైమ్స్ నౌ–-నవభారత్’ సర్వే వెల్లడించింది. ఎన్డీయే కూటమికి 285–325 ఎంపీ సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కూటమికి111–149 సీట్లు వస్తాయని ‘జన్ గణ్ కా మన్’ పేరుతో నిర్వహించిన ఈ సర్వే ఫలితాల్లో తేలింది. యూపీలో బీజేపీకి ఏకంగా 50.30 శాతం ఓట్లు వస్తాయని సర్వే పేర్కొంది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 37 శాతం ఓట్లతో 9–11 ఎంపీ స్థానాలను గెలుచుకోవచ్చని వెల్లడైంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ కు 29.2 శాతం, బీజేపీకి 25.3 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. అయితే, ఏపీలోని 25 ఎంపీ సీట్లకు వైఎస్ఆర్సీపీ ఏకంగా 24–25 సీట్లను గెలుచుకుంటుందని, దేశంలో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. అలాగే పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న టీఎంసీకి 20 నుంచి 22, ఒడిశా రూలింగ్ పార్టీ బీజేడీకి 12 నుంచి 14, ఆమ్ ఆద్మీ పార్టీకి 4 నుంచి 7, సమాజ్ వాదీ పార్టీకి 4 నుంచి 8, ఇతరులకు 18 నుంచి 38 సీట్లు వస్తాయని సర్వే వెల్లడించింది.
