V6 News

నవదీప్ ఫోన్ డేటాను డిలిట్ చేశాడు: నార్కోటిక్ ఎస్పీ సునితారెడ్డి

నవదీప్ ఫోన్ డేటాను డిలిట్ చేశాడు: నార్కోటిక్ ఎస్పీ సునితారెడ్డి

మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సునీతారెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. శనివారం నవదీప్ ను విచారించాం.. అడిగిన ప్రశ్నలన్నింటికి నవదీప్ సమాధానం చెప్పాడు. నవదీప్ నుంచి ఫోన్ స్వాధీనం చేసుకున్నాం.. అయితే అందులో డేటాను డిలిట్ చేశారు... ఫోన్ రిట్రైవ్ చేసిన తర్వాత నవదీప్ ను మరోసారి విచారణకు పిలుస్తామన్నారు సునీతారెడ్డి.  

తాను ఇప్పుడు ఎలాంటి డ్రగ్స్ వాడటం లేదని..తన స్నేహితుడు రామ్ చంద్రతో కలిసి గతంలో బీపీఎమ్ పబ్ నిర్వహించినట్లు నవదీప్ విచారణలో తెలిపాడని సునీతారెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధం ఉన్న మరో ముగ్గురు కలహర్ రెడ్డి, స్నాట్ పబ్ ఓనర్ సూర్య, రవి పులపాటి సోమవారం విచారిస్తామని నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు.