మన నార్కోటిక్ టీం.. పాన్ ఇండియా లెవల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు : నవదీప్

మన నార్కోటిక్ టీం.. పాన్ ఇండియా లెవల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు : నవదీప్

మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ నార్కోటిక్ విచారణ ముగిసింది. దాదాపు ఆరుగంటలపాటు నవదీప్ ను నార్కో అధికారులు విచారించారు. రిమోట్ లింక్ ఇన్వెస్ట్ చేసి విచారణ జరిపారు. నింది తులు దేవరకొండ సురేష్, రామచంద్రతో నవదీప్ కు ఉన్న పరిచయాలపై ఆరా తీశారు అధికారులు. నిందితులు సురేష్, రామచంద్ర అకౌంట్ లోకి నవదీప్ డబ్బులు బదిలీ చేసినట్టు గుర్తించారు. సినీ ఫైనాన్సర్ వెంకటరత్నారెడ్డితో ఉన్న పరిచయాలపై కూడా ఆరా తీశారు. దీంతోపాటు నవదీప్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, వ్యాపారాలకు సంబంధించిన వివరాలను కూడా నార్కో టీం అడిగారు.  

హీరో నవదీప్ మాట్లాడుతూ..  డ్రగ్స్ కేసులో నాకు నోటీసులు ఇచ్చినందుకు నేను హాజరయ్యాను... డ్రగ్స్ కేసులో సిపి సివి ఆనంద్ ఎస్పీ సునీత రెడ్డి నేతృత్వంలో టీం బాగా పనిచేస్తుంది... రామచంద్ర అనే వ్యక్తి నాకు పరిచయం అన్నమాట వాస్తవమే.. నేను ఎక్కడ డ్రగ్స్ తీసుకోలేదు, కొనుగోలు చేయలేదన్నారు నవదీప్.

గతంలో ఒక పబ్ ను నిర్వహించినందుకు నన్ను పిలిచి విచారించారు.. గతంలో సిట్, ఈడీ విచారించింది ఇప్పుడు టీఎస్ NAB విచారిస్తుంది..  అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను.. అవసరం ఉంటే మళ్లీ పిలుస్తామని చెప్పారని నవదీప్ తెలిపారు.